కావ్యం అంటే ఏమిటి,దాని ప్రయోజనం

Updated: March 12, 2018 01:29:15 PM (IST)

Estimated Reading Time: 3 minutes, 48 seconds

ఆంగ్లంలో కావ్యం, కవిత్వం అనే పదాలు సామాన్యంగా ఒకే అర్థంలో వాడబడుతూండటం గమనించవచ్చు. అదే తెలుగుకు వచ్చేసరికి.... కావ్యం వేరు, కవిత్వం వేరు. చిన్న ఖండికలు వేరుగా చెప్పబడుతున్నాయి. చాలా మంది శతకాలు కూడా కావ్యంగా పొరబడుతున్నారు. చిన్న ఖండికలు కొన్ని కలిసి కవిత్వంగా వెలువడవచ్చు. 

ఇక కొన్ని కవితలు కలిపితే లేదా దీర్ఘకవిత్వమైతే ఒక ప్రణాళిక లేదా కథ, సంఘటనతో కూడిన కవిత్వంగా రాస్తే దాన్ని కావ్యం అంటాం. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని కావ్యం అంటాం. అందులో గల 'ప్రతిజ్ఞ' అనే ఖండికను కావ్యం అనం.  ప్రాచీనుల దృష్టిలో కవిత్వం అంటే కేవలం ఛందోబద్ధ రచనగా రూఢమైంది. పద్యం, గద్యం, పద్య గద్యాత్మక చంపూ కావ్యమైనా కావ్యమే. కవి కలం నుంచి జాలువారిన అపూర్వ సృష్టి కావ్యం. కవి ఆత్మీయతలు కావ్యంలో ప్రతిఫలిస్తాయి.  

కావ్య ప్రయోజనం ఏమిటి

కావ్య రచన వల్ల, కావ్య పఠనం వల్ల నైపుణ్యం, కళా విజ్ఞానం అలవడుతుంది. మంచి కావ్యం వల్ల ఆనందం కలుగుతుంది అని మన ప్రాచీన కవులు చెప్పడం జరిగింది.  భామహుడు చెప్పిన దానిని బట్టి కూడా ఆనందం, అదే సమయంలో మన జీవితానికి పనికొచ్చే ఉపదేశాలు కావ్య ప్రయోజనాలని చెప్పవచ్చు. ఆనందవర్ధనుడు 'సహృద యజన మన ప్రకాశమును కావ్య ప్రయోజనంగా చెప్పటం వల్ల 'మనప్రీతికే' ప్రాధాన్యమిచ్చాడు. అభినవ గుప్తుడు కూడా

కామెంట్స్