"శృంగార శివగంగ"

Updated: September 9, 2018 11:20:24 PM (IST)

Estimated Reading Time: 4 minutes, 18 seconds

అమావాస్య రోజు శివాలయంలో నిద్రచేస్తే సంకట హరణమని, ఆరోగ్యం సిద్ధించి అడ్డంకులు తొలగుతాయని శాస్రం చెబుతోంది. అయితే ఈ శ్రావణ మాసపు అమావాస్య ఆదివారం (09-09-2018)సాయంత్రం ఇంచుమించు ఇలాంటిదే జరిగింది విభిన్నంగా. అందుకు వేదిక బహుముఖప్రజ్ఞాశాలి శ్రీ రావి కొండలరావు గారి నివాసం. వారి నిర్వహణలో నడిచే సాహిత్య సంగీత సమాఖ్య సభ్యులతో జరిగిన ఈ సత్సంగంలో పాల్గొన్న ప్రత్యేక అతిథి  ప్రముఖ రచయిత, కవి, నటులు, నిర్మాత, దర్శకులు ... ప్రత్యేకించి శివాంశ సంభూతులు శ్రీ తనికెళ్ళ భరణి గారు. సాహిత్య సంగీత సమాఖ్య సభ్యులే కాకుండా వెండితెర కళాకారులు మాన్యశ్రీ రాళ్ళపల్లి, వైజాగ్ ప్రసాద్, కోట శంకరరావు, ఉత్తేజ్, సంభాషణల రచయిత శ్రీ రాజేంద్రకుమార్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని అట్లాంటా నగరవాసి, ముఖ్య సమాచార అధికారి శ్రీ వల్లూరి రమేష్, నవ్య వారపత్రిక సంపాదకులు శ్రీ జగన్నాథ శర్మ, ఘంటసాల గళామృతం కల్పయిత శ్రీ కొల్లూరి భాస్కరరావు, ప్రసారభారతి పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ అనంత పద్మనాభరావు, జ్యోతిషరత్న శ్రీ సాగర్  తదితర ప్రముఖులు యెందరో పాల్గొన్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ రావి కొండలరావు శ్రీ తనికెళ్ళ భరణి గారిని పరిచయం చేస్తూ, “మహాశివుడి ప్రవరలో గంగమ్మ పాత్ర వుండీలేనట్టీ వుంటుంది. ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అందుండి

కామెంట్స్